సింగరేణి కాలరీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. భూపాలపల్లి డివిజన్ లోని 9 పోలింగ్ కేంద్రాలలో 5410 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఉత్సాహంగా వస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 84 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ విధులను 650 మంది సిబ్బంది నిర్వహిస్తున్నారు. సింగరేణి అధికారులు, కేంద్ర లేబర్ కమిషన్ అధికారులు పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతోంది.
ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఏడు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Discussion about this post