వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్‌ఫోర్స్ అధికారులు చెక్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో తనిఖీలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు…అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు.
వన్యప్రాణులను ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ చేపట్టిన పోలీసులు …అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చెన్నై నుంచి యువర్ ఫ్రెండ్స్ అక్వేరియం ద్వారా పెట్ జోన్ సిబ్బంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని, గోపాలపట్నం సంతోష్ నగర్ లో సత్య పెట్ జోన్ నిర్వహిస్తున్న…గొందేటి శ్రీనివాసరెడ్డి, పిల్లా నాగేశ్వరరావులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.






















Discussion about this post