హైదరాబాద్‌లో కొత్త ఇళ్లపై సోలార్ కంపల్సరీయా…? సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారా..లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారా.. విద్యుత్‌ను ఆదా చేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నారా.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే ప్లాన్ చేస్తున్నారు. అవి ఉంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని యోచిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకుని.. వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్‌లో సోలార్ ప్యానెల్స్ ఉంటే కొత్త ఇళ్లకు అనుమతి
లోక్‌సభ ఎన్నికల తర్వాత విధానపరమైన నిర్ణయం
సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన
ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ఉండేలా కచ్చితమైన నిబంధన
ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో కొంత మేర కాలుష్యం ఉంది.అలానే ట్రాన్స్మిషన్ నష్టాలు కూడా తగ్గుతాయి . దాన్ని నివారించి కాలుష్యం లేకుండా విద్యుత్‌ను ఉత్పాదన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దీని కోసం సోలార్ ఎనర్జీ ప్రవేశపెడుతున్నారు. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోను సోలార్ ఎనర్జీ హబ్‌లు మార్చే ప్లాన్ చేస్తున్నారు.
ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.. వాటిని సబ్ స్టేషన్లకు అనుసంధానించి.. విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై మంత్రి భట్టి ఉన్నతాధికారులతో చర్చించారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ అంశంపై సీఎం రేవంత్‌తో చర్చించి.. ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చించనున్నారు.
Discussion about this post