నాగదేవతలను ఆరాధించడమనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు. శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమిని నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమ శివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించారు. నాగుల పంచమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భక్తులు నాగదేవతలకు పాలు పోస్తూ పూజలు చేశారు. నగరం లోని అతి పురాతనమైన నీల కంఠేశ్వరాలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Discussion about this post