రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ ఈ నెల 18 నుండి ప్రారంభమైంది. దీంతో విశాఖలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. నామినేషన్ అభ్యర్థుల కోసం అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల వద్ద కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారులు ఆదేశానుసారం అభ్యర్థి తరపున నలుగురు సభ్యులను మాత్రమే తహసీల్దార్ కార్యాలయంలో అనుమతిస్తున్నారు. విశాఖ గాజువాకలో ఎలక్షన్ ఆఫీసర్ అదేశాలమేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Discussion about this post