SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం!!! రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమై సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. SRH కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఫైనల్‌ను ఏర్పాటు చేసింది. మే 26న ఇదే వేదిక – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నైలో మ్యాచ్ జరగనుంది.
మిడిల్ ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్ మంచు కురవకపోవడం, పిచ్ పూర్తిగా మారడం తమ ఓటమికి కారణమని చెప్పాడు.
Discussion about this post