కృష్ణా జిల్లా పెదప్రోలు గ్రామంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి శాఖాంబరి అలంకరణ, ఆషాడశారీ సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించారు. విశ్వనాథపల్లి గ్రామం కృష్ణా తీరాన వెలసిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు ఆదివారం శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల రాజా, ఆలయ కమిటీ, గ్రామస్థుల సహకారంతో అమ్మవారిని వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలతో అలంకరణ చేసి విశేష పూజలు చేశారు.
శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారిని మార్చిలో 15 రోజుల పాటు గ్రామంలో ఊరేగించి భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. ఇంట్లోని వారందరూ అమ్మవారికి పూజలు చేస్తారు. వారు దేవతను తమ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. ఆమెకు పట్టుచీరలు సమర్పిస్తారు. అమ్మవారు ఇంట్లోకి వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని గ్రామస్తుల నమ్మకం.
అమ్మవారు మా ఇండ్లలోకి ప్రవేశిస్తే మా సమస్యలన్నీ తీరుతాయని నమ్ముతామని, నాంచారమ్మను మా కుటుంబసభ్యురాలిగా భావించి ప్రతి సంవత్సరం మార్చిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని స్థానికులు తెలిపారు.
Discussion about this post