భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కల్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమి పురస్కరించుకుని ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి, స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు,ముత్తైదువలు, మహిళలు.. శ్రీసీతారాముల కల్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేసారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి..ఏప్రిల్ 17 న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 18 న రామయ్యకు పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
Discussion about this post