శ్రీకాకుళం నియోజకవర్గంలోని టీడీపీలో అసమ్మతి సద్దు మణగలేదు. రానున్న ఎన్నికల్లో గోండు శంకర్ కు టిక్కెట్ ప్రకటిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో అసమ్మతి జ్వాలలు ఎగిసాయి. సిట్టింగ్ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మదేవి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుండ లక్ష్మీదేవి తన ఆవేదనను వ్యక్తం చేశారు. నియోజక వర్గం లో రెండేళ్ల ముందు నుంచి అసమ్మతి మొదలైందని దీనిని సరిచేయాలని, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ని కలిసి చెప్పానన్నారు. అసమ్మతి నేతల మధ్యసయోధ్య కుదర్చలేదు సరికదా.. నియోజక వర్గం లో అసమ్మతిని ఆయన రెచ్చ గొట్టారన్నారు.
Discussion about this post