2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబందించిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులతో పాటు, అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకోగా… 1460 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. రాష్ట్రంలో రెండు రోజులపాటు మద్యం షాపులను మూసివేశారు.
Discussion about this post