శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా పలాసలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో పారిశుద్ధ్య సిబ్బంది రోగులకు వైద్యం చేస్తున్నారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు డ్యూటీ వైద్యులను పలుమార్లు హెచ్చరించినా వైద్యుల తీరు మారలేదు. దీంతో పలాస ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటేనే రోగులు భయపడుతున్నారు.
Discussion about this post