మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపిలో చేరుతున్నారనే ప్రచారం ప్రతిపక్షాల కుట్రేనని బీజేపి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలోని పార్ల మెంట్ పార్టీ కార్యాలయం నుంచి బీజేపి ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని, బీజేపిపై మాట్లాడిన తీరు ప్రజలు గుర్తించాలని, చాలామంది ముఖ్య నాయకులు పార్టీ వీడటానికి జితేందర్ రెడ్డే కారణమని అన్నారు.
Discussion about this post