రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామానికి చెందిన లవన్ కుమార్ లోన్ యాప్ ల ద్వారా మూడు లక్షల రూపాయలు రుణం తీసుకొన్నాడు .రుణం పొందిన లవన్ అప్పు తీర్చే మార్గం లేకపోవడం, వేధింపులు ఎక్కువ కావడంతో యూట్యూబ్లో దొంగతనం ఎలా చేయాలనే వీడియోలను చూసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నాడు .ఈ నెల 14వ తేదీన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన కోయడ యాదమ్మ మెడలో నుండి రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్ళడంతో పోలీసులు కేసు నమోదుచేసి దుండగుడిని పట్టుకొన్నారు. ఈజీ మనీ కోసం తప్పుడు దారులు ఎన్నుకోవద్దని లోన్ యాప్ ల ద్వారా రుణం పొంది వేధింపులకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీస్ లు సూచిస్తున్నారు.






















Discussion about this post