ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని అనకాపల్లి జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. వేసవిలో నీటి ఎద్దడి అరికట్టేందుకు తీసుకున్న చర్యలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Discussion about this post