దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు ఆరంభంలో సానుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 74వేల 858 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22వేల 704 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.21 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, టైటన్, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Discussion about this post