రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం HLC కార్యాలయంలో పనిచేసే అధికారులు 75 క్వింటాళ్లు ధాన్యాన్ని లంచంగా తీసుకోవడం దారుణమని రాయదుర్గం రైతు రక్షణా వేదిక వ్యవస్థాపకులు శ్రీగౌని ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తుంగభద్ర నుంచి HLC కి రావలసిన ఆంధ్ర వాటాను సక్రమంగా తీసుకురాలేని అధికారులు… రైతుల నుంచి ధాన్యాన్ని లంచంగా తీసుకోవడం అమానుషం అన్నారు. సాగునీటి పారుదలశాఖ అధికారులు, HLC ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Discussion about this post