అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2024 – 2025 సంవత్సరానికి సంబంధించి ముందస్తు స్కూల్ అడ్మిషన్లపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నర్సరీ స్టూడెంట్ కు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలను వసూలు చేస్తూ తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారని అన్నారు. సంబందిత అధికారులకు ఫిర్యాదు చేశామని, విద్యార్థి సంఘం నాయకులు ఫోర్ సైడ్స్ టీవీకి చెప్పారు. విద్యాహక్కు చట్టం ప్రకారం జూన్ ఒకటో తేదీ తరువాత అడ్మిషన్లు తీసుకోవాలని, ఫీజుల వివరాలను బోర్డులో పొందుపరచాలనే నిబంధనలు సైతం పాటించడంలేదని అన్నారు. చైతన్య , నారాయణ, విద్యాసంస్థలతో పాటు పలు కార్పొరేట్ స్కూల్ అడ్మిషన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Discussion about this post