ఖమ్మం నడిబొడ్డున 57వ డివిజన్ లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు టార్పాలిన్ల కింద చదువులు సాగిస్తున్నారు. 1 నుంచి 5 వ తరగతి వరకు 55 మంది విద్యార్థులుండగా కేవలం ఇద్దరు టీచర్లు చదువు చెప్తున్నారు. సొంత బిల్డింగ్ లేకపోవడంతో టీచర్లు నెలకు 15 వందల రూపాయల కిరాయి కడుతున్నారు. ఓ రేకుల షెడ్డు కింద విద్యాబోధన కొనసాగిస్తున్నా సరిపోకపోవడంతో ముందు టార్పాలిన్ కవర్ వేసి దాని కింద తరగతులు నడిపిస్తున్నారు. అయినా వర్షానికి తడుస్తూ.. పిల్లలు పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది.
Discussion about this post