శ్రీ సత్య సాయి జిల్లా లోని హిందూపురం లో హోలీ సందర్భంగా తమిళుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం జరిపి తమ భక్తిని చాటుకున్నారు. హిందూపురం పట్టణంలోని ఫళనీనగర్ , ఇందిరా నగర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవం పండుగ జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. తమిళులు చిన్నారుల సైతం వీపుకు ఇనుప చువ్వలు గుచ్చుకొని హరోం హరా.. అంటూ రథాలను లాగి ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు చేశారు. కోరికలు నెరవేరిన వారు ఇలా ఇనుప చూవులు గుచ్చుకొని తమ మొక్కుబడులను తీర్చుకుంటారని తమిళులు చెబుతున్నారు.
తమిళుల ఆరాధ్య దైవంగా కొలిచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం జరిగే ముందు 48 రోజులు మండల పూజ చేస్తారు. మహిళలు 24 రోజులపాటు ప్రతిరోజు ఒక్క పూట భోజనంతో మాల ధరించి రథోత్సవ కార్యక్రమంలో ఇనుప చెవులు గుచ్చుకొని రథాన్ని లాగుతారు. సుమారు 50 కి పైగా రథాలను పట్టణంలోఊరేగింపుగా తీసుకొస్తారు.
Discussion about this post