ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని ఇప్పటికే బ్యాంకులకు సూచించింది.
ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు సందర్భంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు గడువు ముగియనుంది. దీంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కార్యాలయాలు ఆదివారం పని చేస్తుందని ప్రకటించింది. పాలసీదారులకు అవసరమైన సేవలను అందించేందుకు జోన్లు, డివిజన్ల పరిధిలోని కార్యాలయాలు సాధారణ పనివేళల వరకు తెరిచే ఉంటాయని ఎల్ఐసీ చెప్పింది. పన్ను శాఖ సంబంధిత కార్యకలాపాల కోసం, పెండింగ్లోని డిపార్ట్మెంటల్ పనిని పూర్తి చేయడానికి దేశం అంతటా ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 31 ఆదివారం కూడా తెరిచే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
Discussion about this post