అరవింద్ కేజ్రీవాల్ ఒక సింహం అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని ఇండియా బ్లాక్ మహా ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ జరిగిన మహార్యాలీలో 28 పార్టీలకు చెందిన కీలక నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేజ్రీవాల్ అరెస్టుపై, బీజేపీపై సునీతా అగర్వాల్ నిప్పులు చెరిగారు. జైలులో నుంచి తన భర్త పంపిన సందేశాన్ని, దేశ ప్రజలకు ఇచ్చిన 6 హామీలను వేదిక నుంచే ఆమె చదివి వినిపించారు.
దేశ ప్రజలకు కేజ్రీవాల్ 6 గ్యారెంటీలు ఇస్తున్నారని, పేద ప్రజలందరికీ ఉచిత విద్యుత్, దేశంలోని ప్రతి మొహల్లాకు మొహల్లా క్లినిక్ల నిర్మాణం వంటివి ఆ హామీలని ఆమె చెప్పారు. ఇండియా కూటమికి మీరు బాధ్యత అప్పగిస్తే, భవ్యమైన భారతదేశాన్ని మేము నిర్మిస్తామని, మీకు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నానని…. దేశ వ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్ కల్పనకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. పేదలందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని, ప్రతి గ్రామంలో అత్యద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామ, మొహల్లాలో మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశ పౌరులందరికీ ఉచిత వైద్య చికిత్స అందిస్తామని, ఎంఎస్పీకి అనుగుణంగా రైతుల పంటలకు తగిన ధర చెల్లిస్తామని చెప్పారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపతి కల్పిస్తామని కేజ్రీవాల్ గ్యారెంటీల సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ చదవి వినిపించారు.
Discussion about this post