ఎలక్టోరల్ బాండ్స్‌పై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వీటిని తక్షణమే ఆపేయాలని తేల్చి చెప్పింది. అదే సమయంలో మార్చి 6వ తేదీలో ఇందుకు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని SBIని ఆదేశించింది. అయితే…ఈ గడువులోగా SBI పని పూర్తి చేయలేకపోయింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా…ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
SBI తరపు న్యాయవాదులను 26 రోజులుగా ఏం చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అంతకు ముందు SBI తన వాదనలు వినిపించింది. SBI తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ మరికొంత సమయం కావాలని కోరారు. ఇప్పటి వరకూ ఉన్న ప్రొసీజర్‌ని పూర్తిగా పరిశీలించాలని చెప్పారు. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో బాండ్‌లు కొనుగోలు చేసిన వాళ్ల వివరాలు ఏమీ లేవని, వాటిని గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం చెప్పిందని వాదించారు. అయితే…ఈ వాదనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రాథమిక వివరాలన్నీ ఇవ్వాలని అడిగినట్టు స్పష్టం చేసింది. ఈ మ్యాచింగ్ పేరు చెప్పి కాలయాపన చేయడం కుదరదని మందలించింది.
Discussion about this post