స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాలను సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పై యువతలో అవగాహన కల్పించేందుకు హిందూ వాహిని, భారతీయ సంస్కృతి రక్ష ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో టుకె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా హిందూ వాహిని సంయోజక్ బసవరాజు సత్యం తెలిపారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలను సిద్ధిపేట జిల్లాలో నిర్వహించారు. హిందూ వాహిని, భారతీయ సంస్కృతి రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టూకే రన్ లో పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విక్టరీ టాకీస్ చౌరస్తా నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ పేరుతో 2కే రన్ ను నిర్వహించారు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, సిద్దిపేట రన్నింగ్ అసోసియేషన్ సభ్యులు పంచెలు కట్టుకొని రన్నింగ్ లో పాల్గొన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వలన అనారోగ్యం పాలై జీవితాలు నాశనమవుతాయని. డ్రగ్స్ కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ వాహిని సభ్యులు డిమాండ్ చేశారు.
Discussion about this post