యాదాద్రి తిరుమల దేవస్థానంలోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారు ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ అధినేత మానేపల్లి రామారావు, విజయలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు కొండపై 22 ఎకరాల స్థలంలో అత్యంత అద్భుతంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొత్త బింబ ఆలయంలో ప్రాణ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
Discussion about this post