కాంగ్రెస్ చేసిన ప్రజా పాలనను, మోడీ- కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రచార కమిటి తెలిపింది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ఈ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యక్రమాలను బూత్ లెవెల్ కు తీసుకువెళ్లాలన్నారు. ప్రచారాంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
తుక్కుగుడా లో ఏప్రిల్ 6న జరగబోయే సభలో ఏఐసీసీ మేనిఫెస్టో ప్రకటిస్తుందని,
ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పేరుతో ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయనుందని మున్షి తెలిపారు. పాంచ్ న్యాయ్ అంశాలను తెలుగులో అనువదించి కింది స్థాయి వరకు ప్రచారం చేయాలని, అదేవిదంగా స్థానికంగా ఉండే సమస్యలను అక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలి మున్షి అన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
Discussion about this post