హమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో కె బాబు రెడ్డి, జి సతీష్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘రంగోలి’. అక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని శివమ్ మీడియా బ్యానర్‌పై శివ మల్లాల సత్య టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. రంగోలి అనే తమిళ్ సినిమాని తెలుగులో సత్యగా మీ ముందుకు తీసుకువస్తున్నామని హీరో హమరేష్ అన్నారు. చెన్నైలో రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమా థియేటర్ లో చూసే వాడినని చెప్పారు. నాన్న శ్రీశైలం, అమ్మ చెన్నై కావడంతో నాకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలు రెండు కళ్ళతో సమానం అన్నారు.
Discussion about this post