రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ నాయకులతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రణీత్ రావుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటు.. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పలు రంగాల్లోని వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ ఏకంగా ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. రెండు కంప్యూటర్లలో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ వేసుకున్నట్లు గుర్తించారు. లక్షల కొద్ది రికార్డింగ్స్ ను ప్రణీత్ రావు విన్నట్లు తేలింది. అయితే, ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.
Discussion about this post