నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి ఈ ప్రచారం ప్రారంభమైంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమిల ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల గెలుపు కోసం ఆనం కూతురు కైవల్యా రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు రంగ మయూర్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రంగ మయూర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పదేళ్లుగా మేకపాటి కుటుంబం ఆత్మకూరులో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఆనం చేసిన అభివృద్ధి ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆనం ను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Discussion about this post