ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సకాలంలోనే వృద్ధాప్య పెన్షన్ అందిస్తున్నారని వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా వాలంటీర్ల విధులకు భంగం కలిగించాడని, నిరుపేదల కడుపు కొట్టడానికి చూస్తున్నారని చెప్పారు. వాలంటీర్ల సేవలు నిలిపివేయించేలా ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారని, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డిపై విశ్వసనీయత పెరిగిందని అన్నారు. వృద్ధాప్య పెన్షన్ సకాలంలో అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు.
Discussion about this post