మిత్ర పక్షాల ఉమ్మడి సభ ఏర్పాట్లను ప్రారంభించడం కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిలుకలూరిపేట లోని బోప్పూడి చేరుకున్నారు. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ- జనసేన- బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు.
లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. మూడు పార్టీల ముఖ్య నేతలతో కలిసి సభా ప్రాంగణం వద్ద లోకేష్, భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభను ఆయా పార్టీలు
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోడీ పాల్గొనే సభ కావడంతో లోకేష్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Discussion about this post