డ్రగ్స్ నిర్మూలనకై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని సిఐ కొండల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ ఆపరేషన్ చేస్తున్నరని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఆపరేషన్ లో భాగంగా కట్టంగూరు మండల పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నమన్నారు. సుమారు 20,000 రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Discussion about this post