నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభయ్యాయి. నల్గొండ జిల్లావ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 16, 602 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి ఏడాది జనరల్ విభాగంలో 6,633 మంది, ద్వితీయ సంవత్సరానికి 6,722 మంది,… ఒకేషనల్ మొదటి ఏడాది 1,652 మంది ద్వితీయ సంవత్సరానికి 1,595 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నిమిషం లేటు అయిన అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
Discussion about this post