తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 60 ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర కళను సోనియా గాంధీ నెరవేర్చారని…గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని… యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అక్రమ అరెస్టులు చేయించారని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణి చేతుల్లో పెట్టడంతో ఆవేదనకు లోనయ్యామని కళాకారులు అన్నారు.
Discussion about this post