సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురు దాడికి దిగారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్టులను అప్పగించారన్నారు. కేసీఆర్ మాట్లాడక ముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసి.. ఎవరు ద్రోహులో తేల్చుకుంటామని అన్నారు.
Discussion about this post