కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శలు
తెలంగాణ ఉద్యమ కారులు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసేందుకు ఇవాళ ప్రజాభవన్ కొచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అన్నారని ఉద్యమ కారులు తెలిపారు. అలానే 250 గజాల స్థలం కూడా ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని ఉద్యమ కారులు తెలిపారు. గత ప్రభుత్యం లో KCR తమను ఏ మాత్రం పట్టించుకోలేదని ఎటువంటి గుర్తింపు కానీ సహాయం కానీ చేయలేదని వారు వాపోయారు. తమపై పెట్టిన కేసులు .. వాటి వివరాలు సీఎం రేవంత్ కి అందించేందుకు ఉద్యమ కారులు ప్రజాభవన్ కి వచ్చారు. ఆ విశేషాలేమిటో చూద్దాం
Discussion about this post