బీసీల ఆత్మగౌరవాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తాకట్టు పెట్టిన బీసీల ద్రోహి ఆర్.కృష్ణయ్యని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ తిరుమల నాయుడు మండిపడ్డారు. స్వలాభం కోసం బీసీల ఆత్మ గౌరవంతో ఆటలాడతామంటే తాట తీస్తాం.. అంటూ ఆయన హెచ్చరించారు. ఐదేళ్ళుగా బడుగు బలహీన వర్గాలపై జగన్ రెడ్డి ఊచకోతను చూస్తూ కూడా ఆయనకు భజన చేస్తున్న కృష్ణయ్యకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
బీసీలను అణగదొక్కి, దాడులు, హత్యలు చేస్తూ చరిత్రలో ఎవ్వరూ..ఎన్నడూ.. చేయనంత ద్రోహం జగన్ బీసీలకు చేశాడని ఆయన మండిపడ్డారు. దీన్ని విస్మరించి ఆయనకు వంత పాడటానికి సిగ్గు పడాలన్నారు. బీసీలపై దాడులు చూస్తూ కూడా నోరెత్తని కృష్ణయ్య.. జగన్ రెడ్డి సంఘ సంస్కర్త అనడం హాస్యాస్పదంగా ఉందని హేళన చేశారు.
అమర్నాథ్ గౌడ్‌ని పెట్రోల్ పోసి తగలబెట్టినపుడు, తోట చంద్రయ్య పీక కోసి చంపినపుడు ఎక్కడున్నావ్? అంటూ ప్రశ్నించారు. బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్‌ను రద్దు చేస్తుంటే ఏం చేశావు? సబ్ ప్లాన్, కార్పొరేషన్ నిర్వీర్యం చేసి, బీసీ యువత జీవితాలను చిత్తు చేసినపుడు ఎక్కడున్నావ్? అంటూ అగ్రహించారు. 139 జనరల్ స్థానాల్లో 49 స్థానాలు జగన్ రెడ్డి సొంత సామాజికవర్గానికి కేటాయించడమే సామాజిక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.
Discussion about this post