రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు పాల సాయిరాం అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఓపెన్ ఆడిటోరియంలో… సిద్దిపేట ఆటో కోఆపరేటివ్ సొసైటీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…నిజామాబాద్ లో స్వామి అనే ఆటో కార్మికుడు, జీవనభృతి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు నెలకు పదివేల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Discussion about this post