భారతీయ మూలాలున్న కంప్యూటర్ ఇంజనీర్ అశోక్ వీరరాఘువన్ టెక్సాస్ లోని టాప్ అవార్డ్ కు ఎంపికయ్యారు. రైస్ యూనివర్సిటీలోని జార్జి ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఆయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అకడమిక్స్ లో అత్యున్నత గౌరవపురస్కారం ‘ ఎడిత్ అండ్ పీటర్ ఓ డొన్నెల్’ అవార్డు ఆయనను వరించింది. మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అంట్ టెక్నాలజీ ల్లో విశేష పరిశోధనలు చేసిన వారికి ఈ అవార్డు అందిస్తారు.
ఇమేజింగ్ టెక్నాలజీలో సాధారణ కంటికి కనిపించని వాటిని కనిపించేవిగా ఆయన చేశారు. అశోక్ వీరరాఘువన్ 2002లో ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆపై మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లారు. 2004లో మేరీల్యాండ్ నుంచి ఎలక్ర్టికల్ అండ్ కంప్యూటర్స్ లో పీజీ, 2008 లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు.
‘ఎడిత్ అండ్ పీటర్ ఓ డొన్నెల్’ పురస్కారానికి ముందు 2017లో ఎన్ ఎస్ ఎఫ్ కేరీర్ అవార్డు,హెర్షల్ ఎం రిచ్ ఇన్వెన్షన్ అవార్డు, 2022లో ఆయనకు ఐఈఈఈ ఫెలో అవార్డు తీసుకున్నారు. సంప్రదాయక కెమేరాలోని లెన్సెస్ బదులుగా అతి సన్నని ఫ్లాట్ కంను రూపొందించడంలో కూడా ఆయన కృషి చేశారు. అవార్డు ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రీసెర్చ్ సైంటిస్టులకు, పోస్టు డాక్టరేట్, రీసెర్చ్ విద్యార్థులకు అవార్డు ప్రకటన స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు.
Discussion about this post