తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా రెడ్డిలది ప్రేమ వివాహం… వాలెంటైన్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా రెడ్డిల ప్రేమ ప్రయాణాన్ని, వారి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని చూస్తే… ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తను చదువుకునే రోజుల్లో గీతారెడ్డిని ప్రేమించారు. వీరిద్దరి పరిచయం ఒక బోటులో మొదలైంది.
ఇంటర్ చదువుకునే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ రెడ్డి తొలిసారి గీతారెడ్డిని బోట్లో చూశారు. రేవంత్ రెడ్డి గీతారెడ్డిని పరిచయం చేసుకుని ఆమె కుటుంబ వివరాలు తెలుసుకుని ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత అదికాస్తా స్నేహంగా మారింది. గీతారెడ్డి కోసం తానే స్వయంగా గ్రీటింగ్ కార్డులు తయారు చేసి ఆమెకు పంపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ కథ మొదలైంది. మొదట రేవంత్ రెడ్డి తన ప్రేమను గీతారెడ్డికి తెలియజేయగా…రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని, ముక్కుసూటి తత్వాన్ని చూసిన గీతారెడ్డి…రేవంత్ రెడ్డి ప్రేమను అంగీకరించారు. ఇలా కొంతకాలం తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దవారి దాకా వెళ్ళింది.
మొదట గీత వాళ్ళ పెద్దలు ఒప్పుకోకపోయినా..పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ రెడ్డి నేరుగా ఆమె తరపు పెద్దలతో మాట్లాడి గీతారెడ్డిని పెళ్లి చేసుకోవడానికి వారందరిని ఒప్పించారు. తన ప్రేమను గెలిపించుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో రేవంత్ రెడ్డి గీతారెడ్డిల వివాహం 1992వ సంవత్సరంలో జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఆ జంట ఒకే మాటగా, ఒకే బాటగా నడుస్తున్నారు. రాజకీయ జీవితంలో ఉన్న రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్న గీతారెడ్డి… కుటుంబ వ్యవహారాలను తానే దిద్దుకుంటుంది. రాజకీయాలలో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇద్దరు ఒకరికి ఒకరుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా నిలుస్తున్న ఈ జంట నిజమైన ప్రేమకు అర్థం చెబుతున్నారు.
Discussion about this post