పొత్తు కుదిరింది..! ఇక కలిసి దూసుకెళ్లడం ప్రత్యర్థిని ఓడించడం..! ఇదే జనసేన-టీడీపీ ముందున్న టార్గెట్. పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత జనసేన, టీడీపీ శ్రేణుల్లో మొదలైన ఉత్సాహం.. వారాహి యాత్రతో పీక్స్ కు చేరింది. పవన్ కల్యాణ్ వారాహి యాత్రను టీడీపీ ఓన్ చేసుకోవడంతో అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీల్లో రెట్టించిన ఉత్సాహం మొదలైంది. ఎట్ ది సేమ్ టైమ్.. వైసీపీ ఏది జరగకూడదు అని కోరుకుందో అదే జరిగింది..!
టీడీపీ, జనసేన కలిస్తే మనకి అధికారం రాదు..! ఇదీ వైసీపీలో ఎప్పటి నుంచో నెలకొన్న భయం. ఆ భయం బాగా ఎక్కువైందో ఏమో..! రెండు పార్టీలు షేక్ హ్యాండ్స్ ఇచ్చేవరకు అరుస్తూనే ఉన్నాయి. పేటీఎం బ్యాచ్ కూడా ఓవర్ డ్యూటీ చేసి మరీ టీడీపీ, జనసేనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విడగొట్టడానికి ట్రై చేశాయి. కానీ అన్ని పోస్టులకు లైకులు రావు అన్నట్లుగానే.. అసత్యప్రచారాచారాలన్నీ పాజిటివ్ గా మారవు. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్నచందంగా.. వైసీపీ రెచ్చగొట్టుడు రాజకీయం రివర్స్ అయింది.
ఫేక్ ప్రచారంలో తనకు తానుగానే లేని భయాన్ని క్రియేట్ చేసుకున్న వైసీపీ.. చంద్రబాబు అరెస్టుతో బలమైన ప్రత్యర్థిని కోరితెచ్చుకుంది. టీడీపీ, జనసేనకు పొత్తుకుదిరితే ఎలా ఉంటుందో.. జనసేన వారాహి యాత్రలో క్లియర్ గా తెలిసిపోయింది. పవన్ సభ సూపర్ సక్సెస్ అయింది. దివిసీమ జనసంద్రంగా మారింది. చాలా చోట్ల పోలీసులు అడ్డుకోకుండా ఉంటే అవనిగడ్డలో జనసునామీ వచ్చేది.
మొత్తానికి ఎన్నికలకు ఆరు నెలల ముందే గ్రౌండ్ లెవల్లోనూ రెండు పార్టీల్లో పాజిటివ్ వైబ్రేషన్ రావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం టీడీపీని కాస్త బాధించే వ్యవహారం అయినా.. ఆయన వస్తే మరింత జోష్ ఖాయమనే భావన నెలకొంది.
ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు కావడం, కలిసి ముందుకెళ్లే అంశంపై రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటుండటంతో పాటు వారాహి యాత్ర విజయవంతంగా సాగుతుండటంతో వైసీపీలో టెన్షన్ మొదలైందట. ఏది కాకూడదని కోరుకున్నామో అదే జరిగిందని.. రెండు పార్టీల పొత్తుపై ప్రజల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఎదురెళ్లి మరీ శత్రువును తెచ్చుకున్నామా..? అనే ప్రశ్న వైసీపీ నేతలు తమని తాము వేసుకుంటున్నారట.
జగన్ ప్రభుత్వం హామీలను విస్మరించడం, మద్యపాన నిషేధాన్ని గాలికి వదిలేయడం, పాలన, అప్పుల, రాజకీయ కక్షల వంటివాటివన్నీ ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయని.. ఇకపై వైసీపీకి దబిడిదిబిడేనని టీడీపీ, జనసేన నేతలంటున్నారు.
Discussion about this post