దేశంలో అతిపెద్ద కుంభకోణం ఎలక్ర్టోరల్ బాండ్స్ అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈడీ, సీబీఐ దాడులు జరిపిన సంస్థలే ఎలక్ట్రోరియల్ బాండ్లను కొనుగోలు చేయడంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రోరియల్ బాండ్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది.
ఈ తరుణంలో ఎలక్టోరల్ బాండ్‌పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్ట్రోరియల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు.
కంపెనీలపై ఇటీవల జరిగిన ఈడీ దాడులకు, ఆ తర్వాత బాండ్ల కొనుగోలుకు మధ్య సంబంధాన్ని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా సూచించారు. ఈడీ దాడులు చేస్తుంది. కొన్ని గంటల తర్వాత, ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తారని ఆయన మండిపడ్డారు.
Discussion about this post