తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను ఉపయోగించుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత రేవూర్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరితే బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. గత సీజన్ లో వర్షాలు సరిగా పడకపోవడం వల్లే ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని… రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.
కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించాక ….brs, bjp నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Discussion about this post