కాఫీ ఘుమ ఘుమలు మనకు తెలియనివి కావు.. ఉదయాన్నే..కాఫీ తాగితే ఆరోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఎక్కడి నుంచి ఈ కాఫీ గింజలు మన దేశానికి వచ్చాయి .. దీని రుచులేమిటి ? ఇవి ఎక్కడ పండిస్తారు ? అమెరికాలో కేవలం కాఫీ డికాక్షన్ మాత్రమే ఎందుకు తాగుతారు ? మనం పాలతో కలిపి ఎలా తీసుకుంటాం అనేది తెలుసుకుందాం…
కాఫీ పుట్టింది ఇథియోపియాలో.. దానిని అక్కడ ‘క్వాహ్వా’ అని పిలుస్తారు. కాఫీ గింజలను అరబ్ వాణిజ్య కారులు భారతదేశానికి తెచ్చారు. దక్షిణ భారతదేశం..శ్రీలంకల్లో సేద్యం చేశారు. సూఫీ బాబా బుడాన్ కర్ణాటకలోని చిక్ మంగుళూరులో 1830లో కాఫీ తోటలను పెంచారు. ఆపై బ్రిటీషువారు కాఫీఅరబిక, కాఫీ రోబస్టా అనే రెండు రకాలు పండించారు. కాఫీ అరబికను కొండలపై పెంచుతారు. కాఫీ రోబస్టా ఆఫ్రికా నుంచి వచ్చిందని చెబుతారు. దీనిని పల్లపు ప్రాంతాల్లో పండిస్తారు. మనం కాఫీడికాక్షన్ లో చిక్కటి పాలను కలిపి తాగుతాం.. అదే అమెరికాలో అయితే బ్లాక్ డికాక్షన్ మాత్రమే తాగుతారు.
తమిళనాడులోని కుంభకోణం ప్రజలు కాఫీని చాలా ఇష్టంగా తాగుతారు. ఇక్కడ దొరికే కాఫీ గింజలకు మరేదీ సాటిరాదన్నది వారి వాదం. వాస్తవానికి కాఫీ పొడిలో చికోరి కలుపుతారు. అయితే ఇక్కడి ప్రజలు చికోరి కలిపిన కాఫీని అస్సలు ఇష్టపడరు. వీరంతా డిపార్టుమెంటు స్టోర్స్ కి వెళ్లి కాఫీ గింజలను కొని గ్రైండ్ చేసుకుంటారు.
చికోరిమొక్క వేర్ల నుంచి చికోరిని తీస్తారు. ఇది కాఫీ రుచిని కలిగి ఉన్పప్పటికీ దీనిలో కెఫిన్ ఉండదు. దీనిలో పోషకపదార్థాలతోపాటు బ్లడ్ షుగర్ ను, మలబద్దకాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
భారతదేశం చికోరి ఉత్పత్తిలో మూడోస్థానంలో ఉంది. దీనిని ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, సిక్కింల్లో పండిస్తారు. కాఫీ గింజల్లో కంటే చికోరిలోనే పోషక విలువలు ఎక్కువుంటాయి అని కూడా కొందరంటారు. ఇవి మన కేంద్ర నాడీమండలాన్ని ఉత్తేజపరుస్తాయంటారు. ఏపీలో అరకువ్యాలో లో పండించే ‘అరబిక’ కాఫీకి చాలా మంచి పేరుంది. దీనికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంది. తమిళనాడులోని శివరాయ హిల్స్ , కర్ణాటకలోని మంజరబాద్ ఫోర్ట్ లో దీనిని బాగా సాగుచేస్తారు.
దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది ఫిల్టర్ కాఫీ …స్ట్రాంగ్ కాఫీ డికాక్షన్ కు చిక్కటి పాలు కలిపి ఒక హైట్ నుంచి కాఫీ పోస్తే వచ్చే నురగ మరింత బాగుంటుంది…
బాగా వేయించిన కాఫీ గింజలను పొడి చేసి నీళ్లల్లో మరిగించి, దాల్చిన చెక్క, కాస్త అల్లం, యాలకులు వేసి నల్ల బెల్లం కలిపితే వచ్చేదే బెల్లం కాఫీ ..కాస్త చేదుగా, తియ్యగా ఉండే దీని రుచే వేరబ్బా..
Discussion about this post