భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య ఇంటి వద్ద మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భద్రాచలం రాముల వారిని ఆశీస్సులతో…కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. దేశంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో వైద్యం, విద్య అందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Discussion about this post