ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న కూరాకుల నాగభూషణంపై సొంత సొసైటీకి చెందిన మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి విజయకుమారికి అవిశ్వాస తీర్మాన లేఖను అందజేశారు. దీనిపై డీసీఓ తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
వి.వెంకటాయపాలెం సొసైటీ ఛైర్మెన్ గా గతంలో ఎన్నికయిన కూరాకుల నాగభూషణం అనంతరం డీ.సీ.సీ.బీ. డైరెక్టర్ గా, చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు సొంత సొసైటీలోని 13 మంది డైరెక్టర్లలో 11 మంది అవిశ్వాసం ప్రతిపాదించారు. ఆయనపై నమ్మకం, విశ్వాసం కోల్పోవడంతో అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని డైరెక్టర్లు వివరించారు.
Discussion about this post