మహిళలు అభ్యున్నతికి టీడీపి కృషి చేస్తుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం…కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రూపొందించిందని అన్నారు. తెలుగు మహిళలతో కలిసి.. జిల్లా టీడీపి కార్యాలయంలో కలలకు రెక్కలు పోస్టర్ ఆయన ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ… ఉన్నత చదువులు కోసం మహిళలు తీసుకొనే రుణాలకు ఈ పధకం ద్వారా లబ్ది చేకూరుతోందని అన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చాక మహిళల ఉన్నత చదువుకి తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే శ్యూరిటీగా ఉంటుందని అన్నారు.
Discussion about this post