‘ప్రేమలు’ సినిమాలో రీను పాత్రలో నటించి, మెప్పించిన మమిత బైజు పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాతో ఆమె ఒక్కరోజులోనే స్టార్ అయిపోయింది. దర్శకుడు రాజమౌళి సహితం ఆమెను పొగడకుండా ఉండలేకపోయారు. ‘గీతాంజలి’ సినిమాలో గిరిజ, ‘ఫిదా’ లో సాయి పల్లవి ప్రేక్షకులని ఎంతగా అలరించారో ఇప్పుడు ‘ప్రేమలు’ సినిమాలో మమిత బైజు కూడా అంతలా అలరించారు అని రాజమౌళి అన్నారు. దీంతో ఎవరీ మమిత అంటూ చాలా మంది నెట్లో వెతుకుతున్నారు.
‘ప్రేమలు’ మలయాళంలో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. ‘ప్రేమలు’ మలయాళం సినిమా అయినా, ఈ సినిమా షూటింగ్ ఎక్కువభాగం హైదరాబాదులో చిత్రీకరించడంతో తెలుగు ప్రేక్షకులకి ఇది మరింత దగ్గరైంది.
మమిత బైజు, మలయాళం నటి. ఆమె పుట్టినరోజు జూన్ 22, 2001, తల్లిదండ్రులు డాక్టర్ బైజు కృష్ణన్, మణి. ఆమె మొదటి సినిమా మలయాళంలో ‘సర్వోపరి పలక్కరన్’. 2017లో మొదటి సినిమా చేసినా, 2021 ‘ఆపరేషన్ జావా’ అనే సినిమాతో ఆమెకి మంచి పేరొచ్చింది. మమిత ఇప్పుడు బీఎస్సీ సెక్రెడ్ హార్ట్ కాలేజ్ లో చదువుతోంది.
Discussion about this post