జపాన్ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్ ల్యాంచ్‌ప్యాడ్‌కు అత్యంత సమీపంలోనే పేలిపోయింది. దీంతో ప్రైవేటు రాకెట్ సాయంతో ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం తీరలేదు. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన జపాన్.. తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post