పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రంగామే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని, ఏపీలో దాదాపు లక్ష 25 వేల మంది సచివాలయ సిబ్బంది ఉండగా, 66 లక్షల మందికి పెన్షన్లు సకాలంలో ఎందుకివ్వలేరని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీపై అధికార వైసిపి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, వైసీపీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? వైసిపి కార్యకర్తలా? చెప్పాలని డిమాండ్ చేశారు.
Discussion about this post