బకింగ్‌హామ్ ప్యాలెస్ అంటే ప్రపంచానికి బ్రిటన్ రాణి ప్యాలెస్ అని తెలుసు. ఇలాంటి విలాసవంతమైన ప్యాలెస్ భారతదేశంలోనూ ఉంది. భారతదేశంలోని ఈ ప్యాలెస్ చాలా పెద్దది. ఈ ప్యాలెస్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటి హోదా కూడా ఇచ్చారు. ఈ ప్యాలెస్‌లో 170 గదులు … అనేక తోటలు ఉన్నాయి. ఇందులో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. ఇది బరోడా రాజకుటుంబ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అన్నమాట. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. మహారాజా సాయాజీరావు గైక్వాడ్ 1880లో ఈ ప్యాలెస్‌ని నిర్మించారు. అప్పుడు దాని ధర 18 వేల గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ అంటే మన డబ్బుల్లో చూస్తే అప్పుడు మొత్తం ధర పంతొమ్మిది లక్షల ఆరు వేల 950కోట్లు అన్నమాట. అయితే, నేడు ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన ఆస్తిగా మారింది. ప్రస్తుత ధర సుమారు రూ. 24 వేల కోట్లు. ఇది భారతదేశంలో నిర్మించిన ప్రైవేట్ నివాసాలలో అత్యధిక ధర కలిగినది.
Discussion about this post